జయశంకర్ సార్ ను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు.'
- సా చై వే నాయకులు.
కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ 14వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి సామాజిక చైతన్య వేదిక నాయకులు పూల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ జయ శంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాన్ని అంకితం చేశాడు అన్నారు. సా చై వే ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ శంకర్ సార్ త్యాగం వల్లనే సాధ్యమైందన్నారు. సా చై వే సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ అని కొనియాడారు. అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విర్భావానికి కృషి చేసిన జయశంకర్ సార్ ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అన్నారు. పూలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ సార్ చేసిన కృషిని వక్తలు గుర్తు చేశారు . తెలంగాణ ప్రజలు జయశంకర్ సార్ త్యాగాలను ఎన్నటికీ మరువలేరని అన్నారు.

