పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తా.
-- వేముల కృష్ణ.
Scv News Kasipet:--
పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం కోసం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. మంచిర్యాల నియోజకవర్గానికి కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణను నియమిస్తూ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంచిర్యాల అసెంబ్లీ కోఆర్డినేటర్ గా నియామకానికి కృషి చేసిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. దేశంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. దేశంలో మత రాజకీయాలకు చర్మ గీతం పాడాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సందర్భంగా కోరారు. తనపై నమ్మకంతో కోఆర్డినేటర్ గా నియమించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
