మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 రోడ్డుపై గుంతలు పూడ్చి వాహనదారులకు ఊరట కల్పించిన మానవతావాది  గోనెల శ్రీనివాస్.

 గుంతలను పూడిపించిన గోనెల శ్రీనివాసులు అభినందిస్తున్న స్థానిక నాయకులు.

 సోమగూడెం వద్ద  రహదారి గుంతలను పూడుస్తున్న గోనెల శ్రీనివాస్.



Scv News Kasipet :--

 గుంతల మయమైన రహదారిపై నిత్యం ద్విచక్ర వాహనాలలో  ఆటోలు బస్సులలో వెళ్లే  ప్రయాణికుల అవస్థలను చూడలేక  మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా ట్రాక్టర్ ద్వారా మట్టి తెప్పిచ్చి గుంతలు పూడ్చిన జన సమితి  జిల్లా నేత గోనెల శ్రీనివాస్ ఔదార్యాన్ని  ప్రజలు అభినందిస్తున్నారు .

కాసిపేట మండల ప్రధాన రహదారిపై సోమ గూడెం పాత టోల్ ప్లాజా వద్ద రహదారిపై గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు, ఆటోలలో, బస్సులలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రోడ్లు భవనాల శాఖ రహదారిని పట్టించుకోక పోవడంతో వర్షాకాలంలో  ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ప్రయాణికుల అవస్థలను ప్రత్యక్షంగా చూసిన దుబ్బగూడం నివాసి జన సమితి జిల్లా నాయకుడు  మానవతావాది గోనెల శ్రీనివాస్ ఈరోజు  ట్రాక్టర్ ద్వారా మట్టిని తెప్పించి గుంతలను పూడ్చారు. అతడికి సహాయంగా స్థానిక నాయకులు దుర్గం గోపాల్, కారుకూరి లక్ష్మణ్, ఆటో యూనియన్ నాయకులు రామచందర్  తదితరులు సహకరించారు. ప్రయాణికుల అవస్థలను గుర్తించి రోడ్డుపై గుంతలు పూడ్చిన గోనెల శ్రీనివాసు సేవలను పలువురు కొనియాడారు.

ఈ సందర్భంగా మైనింగ్ స్టాప్ నాయకుడు కారుకూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వము సింగరేణి, ఓరియంట్ యాజమాన్యం స్పందించి వెంటనే  సోమగూడెం దేవాపూర్ రహదారిపై ఉన్న గుంతలను పూడ్చేయాలని డిమాండ్ చేశారు. గతుకుల రోడ్లపై ప్రయాణికులు తీవ్రవస్థలు పడుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే స్పందించి  మరమ్మతుకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.