మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి.

 కాసిపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం.

 కాసి పేట మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు.



Scv News Kasipet:-

 బాబా సాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం కాసిపేట మండలంలోని  కాసిపేట దేవాపూర్ కోమటి చేను మల్కపల్లి గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. కాసిపేట దేవాపూర్ గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కాసిపేట మండల కేంద్రంలోని  అంబేద్కర్ విగ్రహానికి కాసిపేట ఎంపీటీసీ అక్క పెళ్లి లక్ష్మి, పెద్దనపల్లి ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్, పల్లం గూడెం ఎంపీటీసీ నవనందుల  చంద్రమౌళి, అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మందాస్, సలహాదారులు లంక లక్ష్మణ్ , పల్లె మల్లయ్య, మాజీ బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ టైంకి వాసుదేవ్  సిపిఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్, మండల సిపిఐ నాయకులు జాడిపోశం, పులి శంకర్, దాడి గట్టయ్య, భాగం రాయలింగు  మండల కాంగ్రెస్ నాయకులు గోలేటి స్వామి, మైదం రమేష్, మేడా రామచందర్  టిఆర్ఎస్ నాయకులు అగ్గి సత్తయ్య, దుర్గం రామచందర్, అంబేద్కర్ వాదులు గోదారుల శంకరయ్య లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి మండల లక్ష్మణ్ దాస్ ఆధ్వర్యంలో  అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు, త్యాగాల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంబేద్కర్వాది గోదార్ల శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ వాదు లమంతా వర్ధంతి, జయంతులకు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడమే జరుగుతుంది తప్ప అతడి ఆశయాలను కొనసాగించడం లేదని అన్నారు. అంబేద్కర్ సంఘం సలహాదారు లంక లక్ష్మణ్ మాట్లాడు తూ అంబేద్కర్ బోధించినట్టుగా మనం మన కాళ్ళ మీద నిలబడకుండా అగ్రవర్ణాలకు బానిసలుగా మారడం వల్లనే మార్పు రావడంలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు గోలేటి స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.సిపిఐ నాయకుడు పులి శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ తెచ్చిన హక్కుల వాళ్ళని ఈరోజు మనం సుఖంగా బ్రతుకుతున్నామని మహనీయుడు త్యాగాలను మరవద్దని అన్నారు.

సిపిఐ మండల కార్యదర్శి దాగ మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన ప్రచారం చేసేందుకు మనమంతా కృషి చేయాలన్నారు. విగ్రహ దాత జాడి పోశం మాట్లాడుతూ అంబేద్కర్ వాదులు రాజకీయాల కతీతంగా అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలన్నారు. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాసుదేవ్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకాన్ని మండలంలోని వివిధ గ్రామాలలో ప్రదర్శించేందుకు మనమందరం కృషి చేయాలన్నారు. సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని ఆశయాలను ఆచరణలో పాటించకపోవడం వల్లనే బహుజన వర్గం అంతా బానిసత్వంలో ఉంటుంద న్నారు. మండల ఇన్చార్జి  లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ  అంబేద్కర్ మండలం నూతన కమిటీ ద్వారా అంబేద్కర్ భావజాలాన్ని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు కృషి చేద్దామని అన్నారు.

అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం కన్వీనర్ గా జాడి పోశం ఏకగ్రీవంగా  ఎంపిక.

అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ గా అంబేద్కర్ విగ్రహ దాత జాడి పోషమును అంబేద్కర్ వాదులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులతో పాటు మండలం మండలంలో అంబేద్కర్ కార్యక్రమాల నిర్వహణ కోసం నూతన మండల కమిటీ ఎన్నుకునేంతవరకు జాడిపోషం కన్వీనర్ గా కొనసాగుతూ ఉండడానికి అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్ ప్రకటించారు.


మండల కన్వీనర్ గా ఎంపికైన జాడి పోషమును  మండల సిపిఐ కార్యదర్శి దాగ మల్లేష్ తో పాటు  కార్యక్రమానికి హాజరైన అంబేద్కర్ సంఘ నాయకులు శాలువాతో సన్మానించారు.

దేవాపూర్ లో  అంబేద్కర్ వర్ధంతి.



దేవాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో పట్టణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గసికంటి మల్లేష్  ఆధ్వర్యంలో  అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.  మండల అంబేద్కర్ సంఘం నాయకులు వడ్లూరు మల్లేష్, కొమ్ముల బాపు, కాంపెల్లి వెంకటేష్ చిప్పకుర్తి బాపు, మద్దిమడ సర్పంచ్ అడే జంగు, కాంగ్రెస్ నాయకులు మెరుగు శంకర్,  నాయకుడు ఆత్రం జంగు, బుద్దిస్ట్ సొసైటీ సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు.