కోమటి చేను సత్యసాయి మందిర్ లో ఘనంగా 9వ వార్షికోత్సవం.
![]() |
| కోమటి చేను సత్యసాయి మందిర్లో 9వ వార్షికోత్సవంలో పాల్గొన్న భక్తులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం కోమటి చేను గ్రామంలోని సత్య సాయి మందిర్ 9వ వార్షికోత్సవ కార్యక్రమం సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన భజనతో గ్రామంలో సత్యసాయి భక్తులు ఊరేగింపు నిర్వహించారు. సత్య సాయి మందిర్ లో సాయి గాయత్రి సహిత గీతం హోమం బాబా అష్టోత్తర శతనామావళి శ్రీ చక్ర పుష్పార్చన జరిగింది.
ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్, కరీంనగర్, జమ్మికుంట పట్టణాలకు చెందిన వ్యాపారి వైకుంఠం కుటుంబ సభ్యులు, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా మెడికల్ అధికారి శ్రీధర్ దంపతులు, జమ్మికుంటకు చెందిన ఉమా ప్రియ వెటర్నరీ హాస్పిటల్ సత్యం దంపతులు, జమ్మికుంట సత్యసాయి సంఘం కన్వీనర్ గన్ను సతీష్ కుటుంబాలు హాజరయ్యాయి. భక్తిశ్రద్ధలతో పూజలు హోమం నిర్వహించిన తధానంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 34 మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. తదనంతరం అన్నదానం చేశారు.సాయంత్రం మందిరంలో దీపాలంకరణ భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు సత్యసాయి మందిరి నిర్వాహకులు రాము టెన్ కి రాజలింగం దంపతులు నిర్వహించారు. దేవాపూర్ మంచిర్యాల పట్టణానికి చెందిన సత్యసాయి భక్తులు కాసిపేట మండలానికి చెందిన ఆకుల పోశం మద్దినేని చిన్న భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.


