రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన సర్పంచ్ వేముల కృష్ణ, తెలంగాణ ఎంప్లాయ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాసరి వెంకటరమణ.
![]() |
| అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతున్న నిరుపేద శ్రీరాముల రవి రజిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకటరమణ |
![]() |
| శ్రీరాముల రవి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేస్తున్న పెద్దనపల్లి సర్పంచి వేముల కృష్ణ, ఉద్యోగసంఘం అధ్యక్షుడు వెంకటరమణ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం పెద్దన్న పెళ్లి గ్రామ పంచాయితీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీకి చెందిన శ్రీరాముల రవి -రజిత నిరుపేద కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు, ఆర్ధిక సహాయం అందించి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న పెద్దనపల్లి సర్పంచి వేముల కృష్ణ, తెలంగాణ ఎంప్లాయ్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణకుగ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీకి చెందిన శ్రీరాముల రవి - రజిత దంపతులు వీరికి ఇద్దరు చిన్నారులు రవి మంగళి వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం అనారోగ్యం బాలేక ఆస్పత్రికీ వెళ్ళడంతో వివిధ రకాల రోగాలు బయట పడ్డాయి. అప్పడి నుండి ఎలాంటి పనిలేక ఇద్దరు పిల్లలతో ఆసుపత్రిలు తిరుగుతూ అప్పులు చేసి వైద్యం చేసుకుంటున్నారు.ఈ పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ లేక తినడానికి తిండి లేక ఆర్థిక ఇబ్బం దులనుఎదుర్కొంటున్నారు.ఆసుపత్రి ఖర్చుతోపాటు, తినడానికి తిండిలేక ,ఇద్దరి పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేక చదువులు మానేసి చాలా ఇబ్బందులు,ఎదుర్కొంటున్న ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని,
గురువారం జమ్మికుంటలోని రవి తన తల్లి కిరాయి కుంటున్న ఇంటిలో ఉంటున్న వారిని, పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని, ఆరోగ్యం కుదుట పడుతుంది అని మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి దాతలు దయచేసి ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం అందించాలని కోరారు.
దాతలు అందించిన ఆర్థిక సహాయం శ్రీరాముల రవి రజిత ల గూగుల్ పే నంబర్ 9100305055 కు పంపించగలరని పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ మానవతావాదులను ఒక ప్రకటనలో కోరారు.

