కాసిపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్ల ఆందోళన.
- చెవిలో పువ్వు పెట్టుకొని ఆశ వర్కర్లు నిరసన.

చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా వర్కర్లు.
Scv News Kasipet
కాసిపేట మండల కేంద్రంలో గురువారం గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే వైద్య సేవలందించే ఆశా వర్కర్ల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళనకు దిగారు.
ఆశా వర్కర్లు తమ వేతనాలు పెంచాలని ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.