గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.
--- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
![]() |
| కాసిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య పథకం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
Scv News Kasipet:--
తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యం విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పలు పథకాలు ప్రవేశపెడుతుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
కాసిపేట మండల కేంద్రంలోని PHC లో ఈరోజు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజల వైద్య సదుపాయాల కోసం ఎంతో ప్రాధాన్యత నిచ్చి పలు పథకాలు ప్రవేశపెట్టింది అన్నారు. ఆరోగ్య మహిళ పథకం ద్వారా 18సంవత్సరాలు దాటినా మహిళలు ఎవరైనా ప్రతి మంగళవారం ఉచితంగా 8రకాల రక్త మూత్ర, పరీక్షలు చేసి ఏదైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు ఇంజక్షన్లు, మాత్రలు తీసుకోవచ్చు అన్నారు. ఆపరేషన్ అవసరం అయితే ప్రభుత్వ పెద్ద హాస్పిటల్ కు రెఫర్ చేసి ఆపరేషన్ చేపిస్తారు అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలపై ఆషా వర్కర్స్, ఏ ఎన్ ఏం వారు శ్రద్ధపెట్టి నిరుపేద మహిళలను చైతన్య వంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి రొడ్డ లక్ష్మి, జడ్ పి టిసి పల్లె చెంద్రయ్య,వైస్ ప్రెసిడెంట్ పుస్కూరి విక్రంరావు, ఎంపిటిసిలు నవనందుల చెంద్రమౌళి, అక్కేపెల్లి లక్ష్మి, కొండ బత్తుల రాంచేందర్, సర్పంచ్ లు, ఆడే భాదు, దేవికొండయ్య, సపాట్ శంకర్, రామటెంకి శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షులు దుర్గం పోశం. కోఆప్టెడ్ మెంబర్ సిరాజ్ ఖాన్, బి ఆర్ ఎస్ కార్యదర్శి మోటూరి వేణు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామటెంకి వాసుదేవ్, AMC డైరెక్టర్ ఏనుగు మంజులరెడ్డి, ఉప సర్పంచ్ లు. బోయిని తిరుపతి, పిట్టల సుమన్, అశోక్, EX జడ్ పి టిసి రౌతు సతయ్య,. విలేజీ ప్రెసిడెంట్ లు, అగ్గి సతయ్య. మద్దెవేణి వేణు, మెర్గు శ్రీనివాస్వా, వార్డు మెంబర్లు సందీప్, రేణుక, బి ఆర్ ఎస్ లీడర్స్ లంకలక్ష్మణ్, గోడిసేల భీమయ్య,sk కరీం, రాజేశం, సచిన్, గోపాల్, ఇంతూయాజ్ మహ్మద్, కిషోర్, రాజన్న,సిద్ధం బాపు, సిద్ధం రాములు తదితరులు పాల్గొన్నారు.

