కెసిఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టుల పట్ల నిరసన.

దేవాపూర్ పోలీసుల అదుపులో బిజెపి మండల ఇంచార్జ్ అట్కాపురం రమేష్, బాల్రాజ్, రామ చందర్ లు
Scv News Kasipet :--
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొమురం భీమ్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కాంగ్రెస్,బిజెపి నాయకులను ముందస్తు చర్యగా పోలీసుల అదుపులో తీసుకోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతుంది. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలో పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వేలాదిమంది పోలీస్ బందోబస్తుల మధ్య పర్యటించే ముఖ్యమంత్రి మంత్రులను ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ఎలా అడ్డుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను ఒకరోజు ముందే ఆయా పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకొని రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని వదిలిపెడు తున్నారు. ఈరోజు కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రత్నం ప్రదీప్, బిజెపి మండల ఇంచార్జ్ అట్కాపురం రమేష్, మండల నాయకులు సూరం సంపత్, బాలరాజులు, దోమల రామ్ చందర్ లను కాసిపేట దేవాపూర్ పోలీసులు అదుపులో కి తీసుకున్నారు.