డాక్టర్ సీట్ సాధించిన గిరిజన విద్యార్థినిని సన్మానించిన ఉపాధ్యాయ సంఘం.
![]() |
| డాక్టర్ సీట్ సంపాదించిన సింధు ప్రియను సన్మానిస్తున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు. |
Scv News Kasipet :--
కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమాన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు అజ్మీర నరసింహ - జ్యోతి ల కూతురు అజ్మీర సింధు ప్రియకు నీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డాక్టర్ సీటు సంపాదించినందుకు TSUTF మంచిర్యాల జిల్లా శాఖ అధ్వర్యంలో సన్మానం చేసి ఆశీర్వదించారు. అజ్మీరా సింధుప్రియ , NEETలో 465 మార్కుల తో ALL INDIA స్థాయి కేటగిరీ లో అత్యుత్తమ ర్యాంక్ (RANK 1580) సాధించి DOCTOR seat సాధించా రు. ఈ కార్యక్రమంలో చిన్నారిని TSUTF రాష్ట్ర కార్యదర్శి వెంకట్ , జిల్లా అధ్యక్షులు రామన్న, ప్రధాన కార్యదర్శి,రాజవేణు , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి.లావణ్య ,ఆర్థిక కార్యదర్శి శ్రీ.కిరణ్ , ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు ఆగాచారి , TSUTF పూర్వ స్టడీ సర్కిల్ కన్వీనర్ దిలీప్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
