రెండో రోజుకు చేరిన పారిశుద్ధ కార్మికులు, కారోబార్ల సమ్మె.
![]() |
| తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని దీక్షలో కూసున్న కాసిపేట మండల పారిశుద్ధ సిబ్బంది. |
కాసిపేట మండలంలో ని పంచాయితీల పారిశుద్ధ కార్మికులు కారోబార్ల సమ్మె శనివారం నాటికి రెండో రోజుకు చేరుకుంది.తెలంగాణ గ్రామ పంచాయతీల పారిశుద్ధ సిబ్బంది కారోబార్ల సంఘం పిలుపు మేరకు మండలం లోని 22 పంచాయతీల కు చెందిన సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న పారిశుద్ధ కార్మికులకు సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, గ్రామపంచాయతీ కారో బార్ల సంఘం జిల్లా నాయకుల సిలోజు మురళి,దాసరి రాజన్నలు పూల మాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో మంచిర్యాల జిల్లాలోని అన్ని మండల సిబ్బంది పాల్గొనాలని శిలోజి మురళి కోరారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించా లని సిబ్బంది కోరుతున్నారు. పారిశుద్ధ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 51 ని రద్దు చేయాలని, కారోబర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని వేతనాలు గ్రామపంచాయతీ నుండి కాకుండా ప్రభుత్వం చెల్లించాలని తదితర పది డిమాండ్లతో పారిశుద్ధ కార్మికులు సమ్మెలో దిగారు.పారిశుద్ధ కార్మికుల సమ్మె వాళ్ళ గ్రామాల్లో మురికి కాలువలు తీసేవారు, చెత్త కుప్పలు ఎత్తే వారు లేకపోవడంతో పరిసరాల పరిశుభ్రత అద్వాన్నంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ కార్మికుల న్యాయమైన సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.

