మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

 కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ.

 కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించినందుకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాసంచ కాలుస్తున్న దృశ్యం.


scv news kasipet:---

 కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో విజయం సాధించి నందుకు కాసిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి పార్టీకి  చెంపపెట్టు లాంటి దన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ఆయాయంలో నిత్యవసర వస్తువులు  గ్యాస్ పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు అవుతున్నారు అన్నారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీల హాయంలో అవినీతి అక్రమాలు పెచ్చరిల్లాయ న్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని కూడా మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. విజయోత్సవ ర్యాలీలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, మైదం రమేష్, కొత్త రమేష్, పంబాల తిరుపతి,జాడి శివ, ముస్తఫా, పుర్రెపోషం,శ్రీనివాస్, వెంకటేష్, ప్రేమ్, భీమ్ రావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.