మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో ఘనంగా బుద్ధ జయంతి.

 దేవాపూర్ లో ఘనంగా బుద్ధ జయంతి.


 దేవాపూర్ అంబేద్కర్ భవన్లో బుద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం నాయకులు బుద్ధిష్ట్ సొసైటీ సభ్యులు.

Scv News Kasipet:--

మంచిర్యాల్ జిల్లా కాసిపేట మండలం లోని దేవాపూర్ అంబేద్కర్ భవన్లో శుక్రవారం రోజున అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా బుద్ధుని విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించా రు. బుద్ధిష్టు మహిళలు  బుద్ధ వందనం చేశారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు గస్కంటి  మల్లేష్, సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు లు మాట్లాడుతూ  2600 సంవత్సరాల క్రితం రాజ కుటుంబంలో గౌతమ్ బుద్ధుడు జన్మించి యుద్ధ విద్యలు, విలు విద్యలు నేర్చుకొని ఆరు సంవత్సరాల పాటు కాటోరమైన ధ్యాన సాధన చేసి జ్ఞానోదయం పొంది సమాజ హితము కోసం మానవుల దుఃఖాలకు కోరికలే కారణమని, అష్టాంగ మార్గాలు, ఆర్య సత్యాలు, పంచశీలాలు బోధనలు చేశాడని దేశాల మధ్య యుద్ధాలు రక్తపాతాలు హింస జరగకూడదని చెప్పాడని నాయకులు మాట్లాడారు.

ఈ కార్యక్రమం లో  అంబేద్కర్ సంగం మండల నాయకుడు  వడ్లూరి  మల్లేష్, సిప్పకుర్తి బాపు, రాజు గోడిసెల సతీష్, ములకల రాములు, రామిల్ల వెంకటేష్, రాజు పాలేకర్ తో పాటు బుద్ధిష్ట్ మహిళలు  పాల్గొన్నారు.