కాసిపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమం జరిగింది. కాసిపేట,కోమటి చేను, మల్కపెల్లి, దేవాపూర్ గ్రామాలలోని అంబేద్కర్ విగ్రహాల కు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. కాసిపేట మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్, అంబేద్కర్ విగ్రహ దాత జాడిపోషం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి కాసిపేట ఎంపీటీసీ అక్క పెళ్లి లక్ష్మి సర్పంచి దేవి, ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు, సీనియర్ నాయకుడు బన్న ఆశాలు టిఆర్ఎస్ నాయకులు అగ్నిసత్తయ్య,మోటూరి వేణు , మాజీ జెడ్పిటిసి రైతు సత్తయ్య లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బండ లక్ష్మణ్ దాస్ మండల నాయకుడు సురేందర్ సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి శిల్లోజు మురళి స్థానిక నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తదనంతరం జరిగిన సమావేశానికి మేడ సమ్మయ్య అధ్యక్షత వహించారు. అంబేద్కర్ దేశానికి,దళిత వర్గాలకు చేసిన సేవల గురించి బన్న లక్ష్మణ్ దాస్, దాగం మల్లేష్, పల్లె మల్లయ్య లు మాట్లాడారు.
దేవాపూర్ లో ...
దేవాపూర్ లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గసికంటి మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై పూల మాలలు వేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ఓరియంట్ గుర్తింపు సంఘ నాయకులు తిరుపతి రెడ్డి, గడ్డం పురుషోత్తం రాజమౌళి, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపెల్లి వెంకటేష్, నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు కొమ్ముల బాపు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో..
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఎంపీడీవో ఎంఏ అలీం, కో ఆప్షన్ నెంబర్ సిరాజ్ ఖాన్, ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిన తిరుపతి, మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, ముత్యం పల్లి డిఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు మద్దినేని వేణు మండల పరిషత్ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.i
కోమటి చేను గ్రామంలో...
కోమటిచెను సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్, విగ్రహ దాత వాసుదేవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది . కాజీపేట ఎస్సై గంగారం కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ దేశానికి దళిత జాతికి చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో పల్లం గూడెం ఎంపీటీసీ చంద్రమౌళి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, మాజీ సర్పంచి జాడిశంకరయ్య, మాసు సుధాకర్, జాడి రాజేష్, బెడ్డల శంకర్, దుర్గం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
సాలే గూడెంలో..
సాలె గూడెం గ్రామంలో సిడం గణపతి పెందుర్తి ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిడం జైతు , మడవి బీము గ్రామ గిరిజనులు పాల్గొన్నారు
కొండాపూర్ చౌరస్తాలో...
కొండాపూర్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అప్పాల శేఖర్, సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు సుధాకర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు కంది ధర్మయ్య, రైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ అధ్యక్షుడు పోడేటి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దనపల్లిలో....
పెద్దనపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచి వేముల కృష్ణ, వార్డు సభ్యులు కొత్త రమేష్, కొమురమ్మలు పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
రొట్టెపల్లిలో..
రో ట్టెపల్లి పంచాయతీలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెంద్రం హనుమంతు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పెద్దమనిషి చిక్రం భీమ్ గ్రామస్తులు పాల్గొన్నారు.








