బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్.
- దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే
![]() |
| కోమటి చేను గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య Scv News Kasipet:-- |
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ని హక్కుల వాళ్ళనే బహుజన వర్గాలు నేడు సుఖంగా జీవిస్తున్నా యని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. కాసిపేట మండలంలోని కోమటి చేను గ్రామంలో ఈరోజు అంబేద్కర్ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బాబా సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయడం గ్రామ అదృష్టమని ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఉన్న రాజ్యాంగాన్ని రాసే బాధ్యత అంబేద్కర్ రావడానికి కారణం అతడి విజ్ఞానమేనన్నారు. దేశంలోని 70 శాతం ఉన్న దళిత బహుజనులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాల వల్ల హాయిగా జీవిస్తున్నాం అన్నారు. చదువును నిర్లక్ష్యం చేయవద్దని పిల్లలందరినీ చదివిపించాలని తల్లిదండ్రులను కోరారు. ఉన్నత చదువులు చదివి పదవులు పొందుతేనే మనకు సమాజంలో విలువ ఉంటుంద ని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత సంక్షేమం కోసమే కృషి చేస్తుందన్నారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం తెచ్చిందన్నారు. దళిత బహుజన వర్గాలకు చెందిన పిల్లలకు విదేశాల్లో చదివేందుకు 20 లక్షల నిధులు ఇస్తుందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహా రాష్ట్ర రాజధానిలో కెసిఆర్ నిర్మించడం గొప్ప విషయం అన్నారు.
నేతకాని పోరాట హక్కుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం గ్రామంలో ఏర్పాటు చేయడంతో కోమటి చేను గ్రామం జ్ఞానవంత మైందని అన్నా రు. బాబా సాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఒకరోజు ప్రపంచ జ్ఞాన దినం జరుపుకోవాలని ప్రపంచ దేశాలకు పిలిపించిందని గుర్తు చేశారు. ఈ దేశంలోని మనువాద బ్రాహ్మణ వర్గం అంబేద్కర్ జ్ఞానాన్ని దళిత బహుజనులను అందకుండా అణిచివేస్తూనే ఉన్నారని అన్నారు. దేశ ప్రధానమంత్రిగా ఉన్న వితంతు బ్రాహ్మణ స్త్రీ ని పూరి జగన్నాథ ఆలయంలోకి రానీయకుండా బ్రాహ్మణవాదులు అడ్డుకున్నారని అదే స్త్రీ నీ దేశ ప్రధానమంత్రిగా చేసిన ఘనత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పతనం అని ఇందిరా గాంధీ కన్నీళ్లు పెట్టుకొని చెప్పిందని గుర్తు చేశారు. అంబేద్కర్ ను దళిత వర్గాలు తమ వాడు అంటూ చెప్పుకోవడం వల్ల బీసీలు దూరమవుతున్నారని అన్నారు. ఆర్టికల్ 340 లో బీసీల కు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఆర్టికల్ 341 లో ఎస్సీలకు ఆర్టికల్ 342లో గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చాడని గుర్తు చేశారు .
గ్రామ సర్పంచ్ రామ టెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ కోమటి చేను గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్న చిన్ననాటి కల నెరవేరిందని మహనీయుడి ఆశయాలు నెరవేరాలంటే తమ పిల్లలందరినీ చదివించాలన్నారు.
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం మాట్లాడుతూ మండలంలోనూ కాసిపేట, దేవాపూర్,మల్కపల్లి గ్రామాలలోనే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని కోమటి చేనులో పెట్టడం సంతోషకరమన్నారు.
ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలంతో అందరు పనిచేయాలనే దళిత నాయకులే తోటి వారు ఎదగకుండా తొక్కుతున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాల మేరకు అందరం కలిసి పని చేయాలన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన అంబేద్కర్ విగ్రహ దాత రామ టెంకి వాసుదేవ్ మాట్లాడుతూ గ్రామస్తులు ప్రతి సంవత్సరం అంబేద్కర్ విగ్రహం వద్ద మూడు పండుగలు చేసుకోవాలని సూచించారు . ఏప్రిల్ 14వ అంబేద్కర్ జన్మదినం, డిసెంబర్ 8న వర్ధంతి, ఏప్రిల్ 12న విగ్రహావిష్కరణ పండుగలు చేసుకోవాలని అన్నారు.
కోమటి చేను గ్రామ మహిళల సాంస్కృతిక బృందంచే బహుజన పోరాటయోధుల పాటలతో కోలాటం ఆడడం అందరినీ అలరించింది. కార్యక్ర మానికి ముందు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను గ్రామ అంబేద్కర్ కమిటీ నాయకులు మహిళా కోలాట బృందంతో ఊరేగింపుగా విగ్రహావిష్కరణ వద్దకు తీసుకువచ్చారు . విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చే నిర్వహించారు.
కార్యక్రమం లో ఎంపీపీ రోడ్డలక్ష్మి, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, , వైస్ ఎంపీపీ విక్రం రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఎంపీటీసీ చంద్రమౌళి, రామచందర్, అక్క పెళ్లి లక్ష్మి, సర్పంచులు విజయ, తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ కమిటీ నాయకులు బెడ్డల శంకర్, జాడి సతీష్,కుమ్మరి సంతోష్,జాడీ శంకరయ్యలు, దుర్గం సాగర్, దుర్గం కృష్ణ కమిటీ యువత పాల్గొన్నారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అప్పల శేఖర్ అన్నదానం చేశారు.










