బారస పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు కృషి చేయాలి.
మూడు జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణరావు.
![]() |
| ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న నారదాసు లక్ష్మణరావు. |
ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు.
Scv News Kasipet :--
తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీ కార్యకర్తలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మూడు జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణరావు అన్నారు.కాసిపేట మండలం కేంద్రంలోని ముత్యం పెళ్లి క్రీడా మైదానం లో గురువారం బెల్లంపల్లి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన బారాస ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిరియ్యాల, కొమ్మురం భీమ్ ఆసిఫాబాద్,బి.అర్.ఎస్ పార్టీ ఇంఛార్జి శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏళ్లుగా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని వివరించారు. మరొకసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కార్యకర్తలు అంతా పట్టుదలతో గ్రామాల్లో ప్రచారం చేయాలని అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి,ఆసరా షాద్ ముబారక్, రైతుబంధు దళిత బంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఆధార అభిమానాలు పొందిందని అన్నారు. ప్రజల అండదండలతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ ,కాసిపేట ఎంపీపీ రోడ్డు లక్ష్మి ,జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య ,వైస్ ఎంపీపీ పి.విక్రమ్ రావు ,పాక్స్ చైర్మన్ నీల ,రైతు సంఘం మండల కోఆర్డినేటర్ దుర్గం పొచం ,బి.అర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణా రెడీ,స్థానిక సర్పంచ్ అడే బాదు, బి.అర్ ఎస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


