' భారతదేశ సాంస్కృతిక
విప్లవానికి వేగుచుక్క'
వేమన జయంతి నేడు.
- ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రజా కవిని ఈ దేశంలోని మనువాద బ్రాహ్మణులు దిగంబరుడిగా ఎందుకు చిత్రీకరించారు?
- వేల ఏండ్ల క్రితం వేదాలను భద్రపరిచిన ఈ దేశంలో విదేశుడైనా సిపి బ్రౌన్ వచ్చేంతవరకు వేమన పద్యాలు ఎందుకు వెలుగు చూడలేదు?.
మానవతా వాది, సంఘసంస్కర్త ప్రజా కవి వేమన జయంతి సందర్భంగా నికార్సైన నిజాలతో Scv News అందిస్తున్న ప్రత్యేక కథనం....
![]() |
| ప్రజా కవి వేమన. |
Scv News Kasipet:--
తెలుగు భాషా సాహిత్యాలను సామాన్య జనాలలోకి తీసుకు పోయి సామాజిక సంస్కరణలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రజాకవి వేమన. పండితుల నుండి మొదలుకొని సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే రీతిలో అనంతమైన అర్ధాన్ని చిన్నచిన్న పదాలలో పొదుగుతూ ఆట వెలది పద్యాలను అల్లి ప్రజల ఆదరణ పొందినవాడు యోగి వేమన.వర్షంలో తడవని వారు వేమన పద్యాలను వినని వారు తెలుగు నేలపై ఉండరనే నానుడి నేటికీ ఉంది.వేమన ఆనాటి సమకాలీన సమాజంలో జీవిత సత్యాలను, మానవతా విలువలను తన ఆటవెలది పద్యాలతో ప్రజలకు బోధించి మేల్కొల్పాడు. నాటి సమాజంలోని అంద విశ్వాసాలను మూఢనమ్మకాలను సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరే కించాడు. కులవ్యవస్థను, విగ్రహారాధ నను మతమౌడ్యాలను నిరసిస్తూ ఎన్నో పద్యాలను అల్లాడు. ముఖ్యంగా మనువాద బ్రాహ్మణుల విగ్రహారాధన, మతం, దేవుడి పేరిట ఆచారాల పేరుతో వారు చేసే అరాచకాలను, దోపిడిని హేతుబద్ధంగా ప్రశ్నించాడు.
నాటి సమాజంలో ప్రజలలో ప్రశ్నించే స్వభావాన్ని రేకెత్తించేలా గ్రామాలలో తిరుగుతూ పద్యాలను పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేశాడు. వేమన జీవితాన్ని పద్యాలను వెలుగులోకి తెచ్చి అతని సామాజిక ఉద్యమానికి ప్రేరణ పొందిన ఆంగ్లేయ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ భారతదేశ సాంస్కృతిక విప్లవానికి వేగుచుక్క లాంటివాడని కొనియాడారు...
వేమన జీవిత చరిత్ర కు సంబంధించిన ఆధారాలు నేటికీ లభించడం లేదు.
తెలుగు నేలపై అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాకవి వేమనకు సంబంధించిన జీవిత విశేషాలను తెలిపే చారిత్రక ఆధారాలు నేటికీ సరిగా లభించడం లేదు. అతడు రాసిన పద్యాలు ఆధారంగానే 17వ శతాబ్దానికి చెందిన వేమారెడ్డి రాయలసీమ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా కర్నూలు, కడప జిల్లాలలో తిరిగి పద్యాలు రాశాడని చరిత్ర కారులు గుర్తిస్తున్నారు. మహాకవి వేమన జీవిత చరిత్ర పుట్టిన స్థలము ఇప్పటికీ స్పష్టంగా తెలవడం లేదు.
ఐక్యరాజ్య సమితి వేమన పద్యాలకు గుర్తింపు.
ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ప్రాంతీయ భాషల్లో ఒక్కొక్క కవిని ఎంచుకొని వారి సిద్ధాంతాలు కవితలను ఎన్నుకొని ప్రచురించిం ది. తెలుగు భాషలో వేమన కవితలను ఎంచుకొని ఆంగ్లభాషలో పుస్తకంగా ప్రచురించి ప్రజా కవికి సముచిత గౌరవాన్ని ఇచ్చింది.ఈ దేశంలోని పాలక వర్గాలు ప్రజా కవి వేమనను గుర్తించకపోవడం, పైగా అవమానించే రీతిలో బట్టలు లేకుండా దిగంబరుడుగా ప్రచారం చేయడం చాలా బాధాకరం.
ప్రజాకవి వేమనను మనువాద బ్రాహ్మణ వర్గం ఎందుకు దిగంబరుడుగా చిత్రీకరించారు.?
ఈ దేశంలోని మనువాద బ్రాహ్మణ వర్గం మాత్రం పండితులు, కవులు, రచయితలు వారు రచించిన కవితలు,పద్యాలు, రచనల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రజా కవి వేమన విషయంలో అతడు రచించిన పద్యాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితం పై ప్రస్తావిస్తూ వ్యసనపరుడని స్త్రీలోలు డని, ఒంటిపై బట్టలు లేకుండా తిరిగే దిగంబరుడుగా ప్రచారం చేసి తీవ్రంగా అవమానించిందిi.సమాజంలో సత్యాన్ని ప్రబోధించిన మహా పండితుడు,సాంఘిక దురాచారాలను ఎండగట్టిన సంఘసంస్కర్త ను, బ్రాహ్మణ దోపిడిని వ్యతి రేకించిన హేతువాది, నాస్తికుడిని పిచ్చివాడిగా చిత్రీకరిస్తూ వేమన జీవితాన్ని ప్రచారం చేశారు.ఆనాటి సమాజంలో బ్రాహ్మణ వర్గం దేవుళ్ళు,గుడులు, యజ్ఞ యాగాలు,కర్మకాండల పేరిట సామాన్య ప్రజలను దోచు కోవడాన్ని సహించలేక హేతువాద దృక్పథంతో విమర్శించాడు. బ్రాహ్మణ దోపిడిని నిరసిస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో పద్యాలతో గ్రామాలలో తిరుగుతూ ప్రజలను ప్రచారం చేస్తూ చైతన్యవంతం చేయటాన్ని మను వాదులు సహించ లేకపోయారు. వేమన వాదనను తట్టుకోలేక తమ దోపిడిని అడ్డుకుంటూ తమ బ్రాహ్మణ వాదాన్ని విమర్శిస్తున్నాడని సహించ లేకనే వేమనను దిగంబరుడుగా ప్రచారం చేసిందని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. వేల ఏళ్ల క్రితం రాసిన వేదాలను, పురాణాలు రామాయణం, మహాభారతం లాంటి వాటిని గ్రంథస్తం చేసి భద్రపరిచిన మనువాద బ్రాహ్మణ వర్గం వందల సంవత్సరాల క్రితం జీవించిన వేమన పద్యాలను, జీవితాన్ని చరిత్రలో రికార్డు చేయకపోవడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఆది నుండి బహుజన వీరులు పండితులపై మనువాద బ్రాహ్మణులకు వివక్షే.?
భారతదేశ చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే ద్రావిడ మూలవాసుల రాజులు ఆర్య బ్రాహ్మణ వర్గాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను, ద్రావిడ పండితులు రాసిన రచనలను వక్రీకరించి తమకు అనుకూలంగా చరిత్రలో రాసుకోవడం బ్రాహ్మణ వర్గాలకు అలవాటే. ఈ దేశ మూలవాసులైన ద్రావిడ రాజులు రావణాసురుడు, తాటకి, హిరణ్యాక్షుడులను రాక్షసులుగా , వలస వచ్చిన ఆర్యులైన రాముడు కృష్ణుడులను దేవతలుగా పురాణాలలో ఎన్నో కథలను అల్లి ప్రచారం చేశారు.చదువుకునే హక్కు బ్రాహ్మణుల చేతుల్లో ఉండడం వల్ల వారి అనుకూలమైన చరిత్రని రాసుకున్నారు.ఈ దేశ అసలైన చరిత్ర ఇదేనంటూ నేటికీ ప్రచారం చేస్తున్నారు.
ఆంగ్లేయులు వచ్చిన తర్వాతనే ఈ దేశ అసలైన చరిత్ర బయటికి వచ్చింది.
17,18 వ శతాబ్దంలో భారతదేశంలోనికి ఆంగ్లేయులు వచ్చిన తర్వాతనే ఈ దేశంలోని మూలవాసుల అసలైన చరిత్ర బయటికి వచ్చింది. హరప్పా మొహంజాదారో తవ్వకాలతో సింధు నాగరికత, ప్రపంచ ప్రాఖ్యాత గాంచిన బౌద్ధం విప్లవం గురించి విదేశీయుడైన బ్రియన్ హిట్ అన్ హాట్ సన్ ద్వారా బౌద్ధం ఈ భారత దేశంలోని పుట్టిన విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. అఖండ భారత్ నిర్మాత బౌద్ధ చక్రవర్తి అశోకుడి చరిత్ర నుండి మొదలుకొని చత్రపతి శివాజీ, సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మొత్తం బ్రిటిష్ వారి ద్వారా లండన్ లోని లైబ్రరీలో మ్యూజియాలలో నిక్షిప్తమైన సమాచారాల ద్వారానే తెలిసింది.
ప్రజాకవి వేమన చరిత్ర ఎలా బయటకు వచ్చింది.?
రాయలసీమకు చెందిన వేమారెడ్డి సామాజిక స్పృహతో నాటి సమాజం లో జరుగుతున్న మూఢాచారాలను, బ్రాహ్మణుల దోపిడిని వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ పద్యాలను పాడుతూ గ్రామాల్లో తిరిగేవాడు.అచ్చమైన తెలుగు పదాలతో సూటిగా నిర్మోహ మాటంగా ఆనాటి మూఢాచారాలను ప్రశ్నించేవాడు. వేమన ఆశు కవి తన పద్యాలను ఎక్కడ గ్రంథస్తం చేయలేదు.ఆ కాలంలో గ్రామాలలో తిరుగుతూ వేమన పాడిన పద్యాలను ప్రజల గుర్తుచేసుకొని పాడుకునేవారు. వేమన పద్యాలు ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండి వారిని మేల్కొల్పేటిగా ఉండడంతో అందరూ వాటిని నేర్చుకున్నారు. గ్రామాలలో పద్యాలు ఒకరికొకరు చెప్పుకోవడంతో వేమన పద్యాలన్నీ తెలుగు నేలంతా విస్తరించాయి. బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలన చేసేందుకు వచ్చిన ఆంగ్లేయ అధికారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించుకొని విని ఎంతో ఆశ్చర్యపోయాడు. చిన్న చిన్న పదాలతో ఎంతో అర్థాన్నిచ్చిన పద్యాలను విని వాటికి ముగ్ధుడై ప్రజల నోళ్లలో నానుతున్న పద్యాలను సేకరించడం ప్రారంభించాడు. మొదట ఆరు వందల తొంబై మూడు పద్యాలతో వేమన పుస్తకాన్ని ప్రచురించాడు. తర్వాత 1200 పద్యాలను తో మారో పుస్తకాన్ని 'ది వరుసస్ ఆఫ్ వేమన' పేరుతో ఆంగ్ల భాషలోకి అనువదించడంతో ప్రజా కవి వేమన పద్యాల గొప్పతనం బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత పూర్ణయ్య చారి వేమన శతకాన్ని ప్రచురించారు. వేమన పద్యాలకు మగుటంగా ఎంచుకున్న 'విశ్వదాభిరామ వినురవేమ' అనేదానికి మనువాద బ్రాహ్మణ వర్గం విశ్వదా అనే ఆమె తాను గౌరవించే వదినే పేరని, అభిరామ అంటే బాల్యమిత్రుడు అని ప్రచారం చేసింది.
వాస్తవానికి 'విశ్వదా' అంటే విశ్వాన్ని సృష్టించిన వాడు 'అభిరామ ' అంటే ప్రియమైన వాడు అనిఅర్థం. 'విశ్వదాభిరామ అంటే విశ్వాన్ని సృష్టించిన వారికి ఎంతో ప్రేమగా ప్రియమైన వాడైన ఓ వేమన చెబుతున్నాడు విను 'అని సిపి బ్రౌన్ అర్ధాన్ని వివరించాడు.
నేటి సమాజానికి వేమన పద్యాలు ఎంతో అవసరం.
నేడు ప్రపంచీకరణ వల్ల మానవ సంబంధాలన్నీ దెబ్బతిని నైతిక విలువలు పతనమవుతు స్వార్థ పూరితమైన నేటి సమాజానికి వేమన నీతిపద్యాల అవసరం ఎంతో ఉంది. గతంలో పాఠ్యాంశా లలో తరగతుల బోధన అనంతరం వేమన,సుమతి నీతి శతకాలను పాఠ్యాంశాలుగా చేర్చి పిల్లలకు బోధించేవారు. చిన్నప్ప టి నుండి పిల్లలలో నైతిక విలువలతో పాటు,చక్కటి నడవడికను నేర్చుకునే వారు.ఇప్పుడు పాఠశాలల్లో ఆ పరిస్థితి లేకపోవడం వల్ల విద్యార్థులు బాధ్యతారాహిత్యాలతో పెరిగిపోతు నేరస్తులుగా మారుతున్నారు.
తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిన వేమనను గుర్తించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యం.
ప్రజా కవి వేమన సాంఘిక దురాచారాలు,మూఢవిశ్వాసాలు, కుల వివక్ష, కుటుంబ సంబంధాల పై వేలాది పద్యాలను రచించి తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతి ఆర్జించి పెట్టాడు. తెలుగునాటా వేమనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ప్రజాకవి వేమన జయంతి కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలేవి కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం తన రాష్ట్రం వాడు కాకుండా వేమన జయంతిని 2018 నుండి అధికారికంగా నిర్వహిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా కవి వేమనను గుర్తించి అధికారికంగా వేమన జయంతిని జరపాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.
