మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ధర్మ రావుపేటలో కాంగ్రెస్ రైతన్న మీ కోసం రచ్చబండ.

ధర్మరావుపేటలో కాంగ్రెస్

'రైతన్న మీ కోసం రచ్చబండ'



Scv News Kasipet :---

 కాసిపేట మండలం ధర్మారావు పేట గ్రామంలో గురువారం రాత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ  అధ్యక్షతన ధర్మారావుపేట,మల్కపెల్లి, కోనూర్, గ్రామాల్లో రైతన్న మీకోసం కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులెవ్వరు అధైర్య పడవద్దని,మరియు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫి చేస్తామన్నారు.  భూమి ఉన్న రైతులతో పాటు,కౌలు రైతులకు కూడా ఏడాదికి పంట సాగు  సహాయం కింద  ఎకరానికి 15000/- ఇస్తామన్నారు. రైతులకి అన్యాయం చేసే ధరణి పోర్టల్ రద్దు,పోడు భూముల రైతులకు,అసైన్డ్ భూముల  లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా  అన్ని యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు.అన్ని పంటలకు మంచి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తారని తెలియజేసారు. వివిధ గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి , ధర్మారావు పేట ఎంపిటి సి పార్వతి మల్లేష్,మల్కేపల్లి ఎంపిటిసి మడావి భీమ్ రావు, సోమగుడెం(కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, వార్డు సభ్యులు కొత్త రమేష్, సీనియర్ నాయకులు నస్పూరి నర్సింగం,పంబాల తిరుపతి , శ్రీధర్,జనార్దన్ రెడ్డి,రాజమౌళి మరియు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.