కాసిపేట మండల కేంద్రంలో
మాజీ ప్రధాని స్వర్గీయ
రాజీవ్ గాంధీ 31 వ
వర్ధంతి .
Scv News Kasipet :--
కాసిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజి ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 31 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం, ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక రంగానికి ఊతం ఇవ్వడం, బ్యాంకుల జాతియం చేయడం , ప్రాజెక్టుల నిర్మాణం లాంటివి ఎన్నో ఈ దేశానికి చేయడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, సోమగూడెం కె ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, మండల కాంగ్రెస్ నాయకులు మల్లేత్తుల రాజేశం, గోలేటి స్వామి,గాదం గట్టయ్య, కూకట్ల దేవెందర్,మైదం రమేష్, జాడి శివ, సిద్ధం రవి, పుర్రె పోషం, శ్రీధర్, క్రాంతి లు పాల్గొన్నారు

