మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం గట్రావ్ పల్లె లో 2 వ రోజు రచ్చబండ

 కాసిపేట మండలం గట్రావ్ పల్లెలో రచ్చబండ               


Scv News Kasipet :---      ‌ కాసిపేట మండలం గట్రావ్ పల్లి గ్రామంలో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్రావుఆదేశాల ప్రకారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో  రెండోవ రోజు రచ్చబండ కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల రచ్చబండ కార్యక్రమ ఇంచార్జి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ  మాట్లాడుతూ టీఆరెస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతులను ప్రజలను మోసం చేస్తున్న తీరును గ్రామ ప్రజలకు వివరించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసే వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను వివరించారు. ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, ,రైతు మద్దతు ధర, రైతులకు ఏకాకాలంలో  2 లక్షల రుణ మాఫీ, రైతులకు ,కౌలు రైతుకు ఎకరాకు 15 వేలు పెట్టు బడి సహాయం,భూమి లేని రైతు కూలీలకు ఏటా 12 వేలు,పంట భీమా,ధరణి పోర్టల్ రద్దు,పత్తి కి ₹6500 మద్దతు ధర ,వరికీ ₹2500 ,తదితర అంశాలు తెలియజేసారు. స్థానిక సమస్యలపైన చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మారావు పేట యంపిటీసి పార్వతి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శ అన్నం కుమార్, ఆదివాసి అధ్యక్షులు కనక రాజు, సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, నాయకులు కూకట్ల దేవెందర్, ఇరవేణి శ్రీనివాస్ నాగరాజు,గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
.