న్యాయమైన డిమాండ్లను 

పరిష్కరించాలని కాసిపేట 

గ్రూప్ గనులలో ఏఐటిసియు 

ఆధ్వర్యంలో ఆందోళన.



SCV News Kasipet :-

 మందమర్రి ఏరియా కాసిపేట గ్రూప్ గనులైన కాసిపేట 1,2 గనుల వద్ద మంగళవారం మొదటి బదిలీ లో సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

కాసిపేట టు గని పై జరిగిన ఆందోళన లో  సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్  పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వేలానికి పెట్టిన 4 బొగ్గు గనులను సింగరేణి అప్ప చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర గుర్తింపు సంఘం నాయకులు కార్మికుల హక్కుల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. పెండింగులో  ఉన్న డిమాండ్ల  సాధన కోసం కార్మికులంతా ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో  పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాసిపేట గనిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కేంద్ర కార్యదర్శి ముసుకు సమ్మయ్య పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని చేశారు. కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి వల్లనే  బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం జరుగుతుందని విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తదనంతరం మెమోరండం కాసిపేట టు గని గని మేనేజర్ రవీందర్ కు, కాసిపేట ఒకటో గని మేనేజర్ అల్లావుద్దీన్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో  కాసిపేట 2గని ఫిట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, నాయకులు  పులి శంకర్, నీలయ్య, బొద్దుల వెంకటేష్, అన్వేష్ లు, కాసిపేట ఒకటో గని వద్ద   పిట్ సెక్రెటరీ బియ్యాల వెంకటస్వామి, మీనుగు లక్ష్మీనారాయణ, బొమ్మ శ్రీనివాస్, ఆడెపు రవీందర్, తుమ్మ రాజేశం ప్రభుదేవ్, నరసయ్య  తదితరులు పాల్గొన్నారు.